మార్కాపురం: జిల్లా కేంద్రంలో సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో సిఐటియు ఏఐటియుసి నాయకులు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సోమయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ... 140 సంవత్సరాల క్రితం అమెరికాలో కార్మికులు ఎనిమిది గంటల పని దినాలను సాధించుకోవడం కోసం పెద్ద ఎత్తున పోరాటం సాగించి వందలమంది చనిపోయారన్నారు. కార్మికుల హక్కులను సాధించుకున్న రోజే మే డే జరుపుకుంటామన్నారు