యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలం రామసముద్రం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం రామసముద్రం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో పదిమంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఎర్రగొండపాలెం మండలం నర్సాయిపాలెం గ్రామానికి చెందిన 15 మంది కూలీలు పనుల కోసం త్రిపురాంతకం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని బాధితులు తెలిపారు. గాయపడిన వారందరూ ఎర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.