యర్రగొండపాలెం: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెసి శ్రీనివాసులకు సమస్యలను తెలియజేసిన వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులు
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలతో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు కారణంగా ప్రభావితమైన ముంపు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఇబ్బందులను జాయింట్ కలెక్టర్ కు తెలియజేశారు. పునరావసం పరిహారం మౌలిక సదుపాయాలు జీవనోపాధిత అంశాలపై నిర్వాసితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.