యర్రగొండపాలెం: 23 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో సీఎం సహాయనిది చెక్కులను లబ్ధిదారులకు టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్న 23 మంది లబ్ధిదారులకు 11 లక్షల 71 వేల 858 రూపాయల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.