ఉరవకొండ: అకాల వర్షాలతో కుప్ప కూలిన పంటలకు నష్టపరిహరం కనీసం మద్దతు ధర కల్పించాలని జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రం అందించిన విశ్వ
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప, కూడేరు మండలాల పరిధిలోని గ్రామాల్లో అకాల వర్షాలు వల్ల కొన్ని వందల ఎకరాల మొక్కజొన్న, అరటి తీవ్ర నష్టం కలిగించిందని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వైయస్సార్సీపి పిఎసి సభ్యులు వై విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్ కు పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారని అకాల వర్షాల ద్వారా రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు. దాదాపు 400 ఎకరాలు మొక్కజొన్న 200 ఎకరాలు అరటి రైతులకు కోట్లలో నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.