మార్కాపురం: కలుజువ్వలపాడు సచివాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు, నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించిన గ్రామస్తులు
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు సచివాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించకుండా నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గ్రామంలోని త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం పంచాయితీ నిధులు 1,35,530 రూపాయలు వ్యయంతో సాగర్ వాటర్ పైప్ లైన్ పనులు చేపట్టారు. కానీ ఇంతవరకు చుక్క నీరు కూడా రాలేదని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కనీసం పట్టించుకోలేదని వారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ నిధుల చెల్లింపులపై కార్యదర్శిని గట్టిగా నిలదీశారు.