పలాస: పలాస రైల్వే స్టేషన్లో 11 కిలోల గంజాయి పట్టివేత: మహిళ అరెస్ట్
పలాస రైల్వే స్టేషన్లో 11 కిలోల గంజాయితో పశ్చిమ బెంగాల్‌కు చెందిన నౌబహర్బీబీ షేక్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్లాట్‌ఫాం నంబర్-2 వద్ద తనిఖీల్లో ఈ గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.