రాయదుర్గం: వైసిపి ప్రభుత్వంలో దళితులపై జరిగిన దారుణాలు ప్రజల్లోకి తీసుకువెళతాం : టిడిపి ఎస్సీ సెల్ నాయకులు
వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన దారుణాలు, దుస్సంఘటనలు ఎండగట్టి కూటమి ప్రభుత్వంలో వారికోసం చేసిన కార్యక్రమాలు చేరవేసేందుకు టిడిపి ఎస్సీ సెల్ కార్యాచరణ చేపట్టినట్లు టిడిపి ఎస్సీ సెల్ నాయకులు తెలిపారు. ఎస్సి, ఎస్టీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ మెంబెర్ ఎం.వెంకటేశులు, ఎస్సి సెల్ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆనంద్ సోమ రాయదుర్గం టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 19, 20, 21 తేదీల్లో మూడు రోజులు పాటు వివిధ గ్రామాల్లోని దళితవాడల్లో పర్యటించి చంద్రన్న పాలనలో దళితులకు జరిగిన మేలును వివరిస్తామని వెల్లడించారు.