మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో అడవి దున్న ప్రత్యక్షమైంది. తుమ్మల అబ్బాయిలు జంగిల్ సఫారీ సమీపంలో రోడ్డు పక్కన చెట్ల మాటున తిరుగుతున్న దున్నను వాహనదారులు గుర్తించారు. బాగా బలిష్టంగా ఉండడంతో భయంతో ఎక్కువసేపు అక్కడ ఉండకుండా వెళ్లిపోయారు. కొందరు ఫోటోలు తీయడంతో వైరల్ గా మారింది.