*దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో ముఖ్యం...*
*ఓ ఎస్ డి నవ జ్యోతి మిశ్రా...*
మార్కాపురం జిల్లా కేంద్రంలో ఓఎస్డి నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములం అనే నినాదంతో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులు పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు జాతీయ జెండాను చేత పట్టుకొని ఉత్సాహంగా ర్యాలీ చేశారు. దేశభక్తి జాతీయ సమైక్యత యువతలో దేశ సేవ భవాన్ని పెంపొందించే విధంగా ర్యాలీ చేపట్టారు దేశ ప్రగతిలో మన వంతు దేశ సేవలో మన బాధ్యత ఐక్యత క్రమశిక్షణ దేశభక్తి బాధ్యత వంటి నినాదాలతో ర్యాలీ చేశారు.