మార్కాపురం: చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు అంకురార్పణ కార్యక్రమం
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బుధవారం రాత్రి జరిగే అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏప్రిల్ రెండో తేదీ ద్వజారోహణము సూర్య వాహనం 3 తేదీ తెల్లవారుజామున కళ్యాణం రాత్రి చంద్ర వాహనం 4 సింహ వాహనం 5 శేష వాహనం 6 వ్యాలీ వాహనం 7 పొన్న వాహనం 8 హనుమంత వాహనం 9 గరుడ వాహనం 10 గజవాహనం 11 రథోత్సవం 12 అశ్వ వాహనం సేవలు ఉంటాయన్నారు.