మార్కాపురం: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణమైన ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు తెలిపిన డిఎస్పి నాగరాజు
మార్కాపురం మండలం రాయవరం గ్రామ మెడికల్ కళాశాల సమీపంలోని మూలమలుపు వద్ద మార్చి 26వ తేదీ తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషాలకు జరిగిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీ ఢీకొని దగ్ధమైపోయిన సంఘటన తెలిసినదే. ఈ సంఘటనలో 14 మంది సజీవ దహనం కాగా 29 మందికి తీవ్ర స్వల్ప గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన ఇద్దరు ముద్దాయిలు డ్రైవర్ యువరాజు హరికృష్ణ ట్రావెల్స్ బస్సు యజమాని హరిబాబు ను అరెస్టు చేసినట్లు డిఎస్పి నాగరాజు తెలిపారు.స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను తెలియజేశారు.