దర్శి: దర్శి మండలం లంకోజనపల్లి-పెద్దకాలవ మధ్యలో రోడ్డు ప్రమాదం..బైక్సై వెళ్తున్న గురు వర్ధన్ అనే యువకుడు మృతి
Darsi, Prakasam | May 11, 2025 దర్శి మండలం లంకోజనపల్లి-పెద్దకాలవ మధ్యలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్సై వెళ్తున్న గురు వర్ధన్ అనే యువకుడు వేగంగా వెళ్తూ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది దర్శి మండలం కట్టసింగన్న పాలెం వ్యక్తి గా దర్శి ఎస్ ఐ మురళి గుర్తించి మృతదేహాన్ని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.