దర్శి: దొనకొండ మండలం దేశిరెడ్డిపల్లి, చందవరం ప్రాంతాల్లో శ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
Darsi, Prakasam | May 10, 2025 దొనకొండ మండలం దేశిరెడ్డిపల్లి, చందవరం ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. మరో పక్క అకాల వర్షాలకు పంట పొలాల్లో ఉన్న మిరప మరియు ఇతర పంటలు తడిచిపోతున్నాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.