దర్శి: దర్శిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం: టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి మండలం చందలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన MSME పార్క్ న్ను శుక్రవారం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. దర్శి నియోజకవర్గంలో పరిశ్రమల అభివృద్ధికి ఈ పార్క్ ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. 11 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దర్శి నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.