దర్శి: దర్శి టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి కి శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు
Darsi, Prakasam | May 11, 2025 దర్శి పట్టణంలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టి పాటి లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా దర్శి పట్టణానికి విచ్చేసిన ఆమెకు టిడిపి కార్యకర్తలు ఆదివారం భారీ పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. దర్శి నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి పుట్టినరోజు కావడంతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున గజమాలతో శుభాకాంక్షలు పలికారు. ఈ సందర్భంగా ఎలాంటి అవార్డుని సంఘటన జరగకుండా పోలీసులు పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.