పాయకరావుపేట: అనకాపల్లి జిల్లాలో వరాహ నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద వరాహ నదిలో స్నానానికి దిగిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ముప్పిడి వంశీ, కాతేటి రిషి, కోడి జగదీశ్ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు.