కనిగిరి: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ప్రతి ఒక్కరూ నిషేదించాలి: కనిగిరి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస రెడ్డి
కనిగిరి మండలంలోని చిన ఇర్లపాడు గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై కనిగిరి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ప్రతి ఒక్కరూ నిషేదించాలన్నారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు ఆయన వివరించారు. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్తలను వేరుచేసి ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు వాటిని అందజేయాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలు చర్యలు తీసుకొని అందుకు అనుగుణంగా కృషి చేయాలన్నారు. .