కనిగిరి: తమటం వారి పల్లి వద్ద ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన కారు
కనిగిరి: కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైన సంఘటన కనిగిరి మండలం తమటం వారి పల్లి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పామూరు నుండి వస్తున్న కారు కనిగిరి మండలం తమటం వారి పల్లి వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపిస్తున్న సమయంలో కారులో ఉన్నవారు కారు దిగి వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది.