కనిగిరి: ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని శంఖవరంలో మంగళవారం శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఇంటింటికి వెళ్లి అవ్వ ,తాతలకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.... రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను భారీగా పెంచి అందజేస్తున్నారన్నారు. పెన్షన్లను పొందిన అలబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.