కామారెడ్డి: కామారెడ్డిలో అగ్నిప్రమాదం: కారులో మంటలు చెలరేగడంతో చాకచక్యంగా ప్రాణాలు కాపాడుకున్న యజమాని
కామారెడ్డి జాతీయ రహదారిపై నవంబర్ 11న కారులో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. మెకానిక్ షాపు నుండి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమయస్ఫూర్తితో కారు యజమాని కిందకు దూకి సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.