కొండపి: కంప్యూటర్ కాలంలో కూడా సాంఘిక బహిష్కరణలుజరగటం సిగ్గుచేటు : రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు
కంప్యూటర్ కాలంలో కూడా సాంఘిక బహిష్కరణలు జరగటం సిగ్గుచేటని రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం టంగుటూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గుడ్లూరులోని దప్పళంపాడులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారిని బహిష్కరించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై మంత్రి స్వామి స్పందించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల, మాదిగలను బహిష్కరణలకు గురి చేస్తే సహించేది లేదన్నారు.