కొండపి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేసిన మంత్రి స్వామి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొండపి టీడీపీ కార్యకర్త తానికొండ వెంకట్రావు కుటుంబానికి మంత్రి బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలంలోని తూర్పునాయపాలెం గ్రామంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో రూ.5 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు. టీడీపీ సంక్షేమ నిధి నుంచి ఈ ఆర్థిక సహాయం అందించినట్ల ఆయన తెలిపారు. కార్యకర్తలకు చంద్రబాబు, లోకేశ్ అండగా నిలుస్తున్నారని మంత్రి తెలిపారు.