కొండపి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెదేపా కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేసిన మంత్రి స్వామి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొండపి టీడీపీ కార్యకర్త తానికొండ వెంకట్రావు కుటుంబానికి కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రూ.5 లక్షల చెక్కును మంగళవారం అందజేశారు. టీడీపీ సంక్షేమ నిధి నుంచి ఈ ఆర్థిక సహాయం అందించినట్ల ఆయన తెలిపారు. కార్య కర్తలకు చంద్రబాబు, లోకేశ్ అండగా నిలుస్తున్నారని మంత్రి తెలిపారు.