కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు సరాసరి ధర కేజీ రూ.242.17: వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్
కొండపి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన వేలంలో పొగాకు సరాసరి ధర కేజీ రూ 242. 17 పలికిందని వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. రైతులు వేలానికి 1188 బేళ్లను తీసుకొని వచ్చారు. అందులో 902 బేళ్లు కొనుగోలు అయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 286 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ట ధర కేజీ రూ 280, కనిష్ట ధర కేజీ రు 210 గా నమోదయింది. వేలంలో 15 కంపెనీలు చెందిన వ్యాపారులు పాల్గొన్నారు.