కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో 902 పొగాకు బేళ్లు కొనుగోలు చేసిన 15 కంపెనీలకు చెందిన ప్రతినిధులు
ప్రకాశం జిల్లా కొండపి స్థానిక పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన వేలంలో పొగాకు సరాసరి ధర కేజీ రూ 242.17 పలికిందని వేలం నిర్వహణ అధికారి జి సునీల్ కుమార్ తెలిపారు. పెదకళ్ళగుంట, నరసరాజుపాలెం, అయ్యపరాజుపాలెం గ్రామాలకు చెందిన రైతులు వేలానికి 1188 బేళ్లను తీసుకొని వచ్చారు.అందులో 902 బేళ్లు కొనుగోలు అయ్యాయి.వ్యాపారులు వివిధ కారణాలతో 286 బేళ్లను తిరస్కరించారు.పొగాకు గరిష్ట ధర కేజీ రూ 280, కనిష్ట ధర కేజీ రు 210 గా నమోదయింది.వేలంలో 15 కంపెనీలు చెందిన వ్యాపారులు పాల్గొన్నారు.