పాయకరావుపేట: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
అనకాపల్లి జిల్లా రేవుపోలవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రాజుపేటకు చెందిన కురందాసు శ్రీను, కొర్ని శ్రీను మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.