దర్శి: తాళ్లూరు MPDO కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన MPDO హనుమంతరావు
Darsi, Prakasam | Apr 26, 2025 తాళ్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సిబ్బందితో ఎంపీడీవో దారా హనుమంతరావు శనివారం సమావేశమయ్యారు. కూలీలకు కనీసం రూ.300 వేతనం వచ్చేలా పనులు కల్పించాలని సూచించారు. వేసవిలో వారికి నీటి సౌకర్యం, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జీపీఎస్, ఏపీవోలు పాల్గొన్నారు.