ములుగు: చిన్నబోయినపల్లి వద్ద అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీని సీజ్ చేసి, కేసు నమోదు చేసిన పోలీసులు
Mulug, Mulugu | Jun 3, 2025 ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడుతో వెళ్తున్న ఇసుక లారీని పోలీసులు సీజ్ చేసిన ఘటన ఏటూరునాగారంలో జరిగింది. ఎస్సై తాజుద్దీన్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని ఇసుక క్వారీ నుంచి అధిక లోడుతో వెళ్తున్న లారీని చిన్నబోయినపల్లి చెక్పోస్ట్ వద్ద అధికలోడును గుర్తించి పోలీసులు స్టేషన్ కు తరలించారు. లారీ సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.