ములుగు: ములుగు జిల్లాలో మొరాయిస్తున్న రేషన్ బియ్యం పంపిణీ యంత్రాలు #localissue
Mulug, Mulugu | Jun 3, 2025 ప్రభుత్వ అమలు చేస్తున్న మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ లబ్ధిదారులకు డీలర్లకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో నిల్చోలేక బియ్యం తీసుకెళ్లేందుకు వచ్చిన సంచులను క్యూ లైన్ లో ఉంచి చెట్ల కింద సేద తీరుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి బియ్యం తీసుకోవడంతో రాత్రి 10 గంటల సమయం పడుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. కొందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలైన మాకు మూడు నెలలకి సరిపడా బియ్యం ఒకేసారి ఇవ్వడంతో కొంత ఆనందంగా ఉందంటున్నారు. యంత్రాలు సైతం మోరయిస్తున్నాయని సిబ్బంది వెల్లడిస్తున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో, కేంద్రం ఆదేశాల