ములుగు: లక్నవరం చెరువులో పడి ఓ వ్యక్తి మృతి
Mulug, Mulugu | Jun 3, 2025 లక్నవరం చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నేడు మంగళవారం రోజున మధ్యాహ్న 3 గంటలకు చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్కు చెందిన కాలబోయిన సమ్మయ్య హమాలీ కులీగా పని చేస్తున్నాడు. కాంటా పనులు పూర్తి కావడంతో చెరువు సమీపంలో దావత్ చేసుకున్నారు. అనంతరం చెరువులోకి దిగిన సమ్మయ్య ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. సమ్మయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.