ములుగు: మేడారం మహా జాతరకు శాశ్వత పనులు చేపట్టాలి: కలెక్టరేట్లో మంత్రి సీతక్క
Mulug, Mulugu | Jun 3, 2025 మేడారం మహా జాతరకు శాశ్వత పనులు చేపట్టాలని మంత్రి సీతక్క అన్నారు. నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం ఒంటిగంటకు ములుగు జిల్లా కలెక్టరేట్ లో అధికారుల సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే రూ.33 కోట్లతో రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు.