ములుగు: డిమాండ్ పంటలు సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలి: మంగపేటలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సంజీవరావు
Mulug, Mulugu | Jun 3, 2025 మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సంజీవరావు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం మంగపేట మండలం మల్లూరు, గాంధీనగర్ గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ ఇతర పంటలను ఆయన పరిశీలించారు. డ్రిప్ వ్యవసాయం, పండ్లతోటలు, ఆయిల్ ఫామ్ పథకాలకు ఉద్యానశాఖ సబ్సిడీలు అందిస్తుందన్నారు. ఉద్యాన యాంత్రికరణకు 50% రాయితీపై పరికరాలు అందిస్తుందని చెప్పారు.