శ్రీశైలం: ఇష్టం లేని పెళ్లి చేశారని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి బండిఆత్మకూరు మండలం సంత జుటురు గ్రామంలో చోటుచేసుకున్న ఘటన
బండిఅత్మకూరు మండలం సంతజూటూరు గ్రామానికి చెందిన సుంకుల అనే యువతి మిస్సింగ్ అయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు ఇష్టం లేని వివాహం చేస్తున్నారని మనస్తాపానికి గురైన యువతి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. యువతి కనిపించకపోవడంతో ఆమె తల్లి చౌడమ్మ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు యువతి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. యువతి ఎక్కడికి వెళ్లింది, ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉంది అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.