విశాఖపట్నం: అసకపల్లి - లంకెలపాలెం రోడ్డు పనులు షురూ: నెల రోజుల్లో పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే పంచకర్ల
పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అసకపల్లి-లంకెలపాలెం రోడ్డును పరిశీలించారు. నెల రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తామని, ప్రమాద బాధితులకు రూ. 16 లక్షల వైద్య సాయం అందించామని ఆయన వెల్లడించారు. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం వివిధ విడతల్లో నిధులు మంజూరు చేసింది.