కర్నూలు: పెద్దకడబూరులో పోలీసుల తనిఖీలు.. సరైన పత్రాలు లేని 51 బైకుల సీజ్
పెద్దకడబూరు మండలం హెచ్.మురవణి గ్రామంలో సీఐ మంజునాథ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 51 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతత కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.