కర్నూలు: ఆదోని న్యూ గాంధీనగర్: వాటర్ ట్యాంక్ సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్ వీరేష్
ఆదోని పట్టణం న్యూ గాంధీనగర్లో పాడైన వాటర్ ట్యాంకును సీపీఐ కౌన్సిలర్ టీ. వీరేష్ మరమ్మతు చేయించారు. స్థానికుల నీటి కష్టాలను గుర్తించి వెంటనే స్పందించిన ఆయన, సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.