శ్రీశైలం: శ్రీశైలంలో బియ్యం లోడ్‌తో డీసీఎం బోల్తా.స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్
శ్రీశైలం సాక్షిగణపతి సమీపంలో దేవస్థానానికి బియ్యం లోడ్‌తో వస్తున్న డీసీఎం వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టిన అనంతరం వాహనం రోడ్డుపై బియ్యం సంచులతో సహా బోల్తా పడింది.సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ, సీఎస్‌ఓ పర్యవేక్షణలో క్రేన్ సహాయంతో డీసీఎంతో పాటు రోడ్డుపై పడిన బియ్యం సంచులను పక్కకు తొలగించారు. దీంతో వాహనాల రాకపోకలకు ఏర్పడిన స్వల్ప అంతరాయం తొలగి ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి