సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు లో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం పండుగ ను నిర్వహించిన క్రైస్తవులు
నాగులుప్పలపాడు మండలం లోని ఉప్పుగుండూరు గ్రామంలో క్రైస్తవులు మట్టల ఆదివారం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఇమ్మానియేల్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో ఈత మట్టలను చేత బూని క్రైస్తవులు ఏసుక్రీస్తు భక్తి గీతాలను ఆలపిస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మట్టల ఆదివారం పండుగ యొక్క విశిష్టతను చర్చి పాస్టర్లు వివరించారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని, క్రీస్తు బోధనలు అనుసరించి ప్రతి ఒక్కరూ సాటి మనిషి పట్ల ప్రేమ, దయాగుణం కలిగి ఉండాలని పాస్టర్లు ఈ సందర్భంగా సూచించారు.