మునగాల: రైతులకు సూచన: ఆరుతడి పంటలతోనే లాభాలు - జడ్పీ డిప్యూటీ సీఈవో కె.మహాలక్ష్మి
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో జడ్పీ డిప్యూటీ సీఈవో కె.మహాలక్ష్మి పర్యటించారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరికి బదులుగా కంది, మినుములు, జొన్నలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని ఆమె సూచించారు. సబ్సిడీపై విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులకు తెలిపారు.