రాయదుర్గం: పట్టణంలో కమనీయంగా జంబుకేశ్వర స్వామి కళ్యాణోత్సవం
రాయదుర్గం పట్టణంలోని కోట ఏరియాలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి కళ్యాణోత్సవం మంగళవారం కమనీయంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మద్యాహ్నం వేదపండితుల మంత్రోచ్చారణల మద్య శాస్త్రోక్తంగా స్వామి వారి కల్యాణం జరిపించారు. ఈ వేడుక తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.