కొండపి: టంగుటూరు మండల కేంద్రంలో సిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి స్వామి
టంగుటూరు మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మరియు మారిటెన్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య నూతనంగా ఏర్పాటు చేసిన సిమ్స్ వైద్యశాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండేపి నియోజకవర్గ ప్రజలకు అత్యధిక వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ శ్రీనివాసరావు సిమ్స్ వైద్యశాలను ప్రారంభించారని తెలిపారు. అదేవిధంగా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ధరలకు అందించాలని సూచించారు.