కొండపి: సింగరాయకొండ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణ
సింగరాయకొండ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని పంచాయతీ సిబ్బంది శనివారం నిర్వహించారు. ప్రజలు తమ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ వనజ అన్నారు. చెత్త, వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా చెత్తకుండీలను వినియోగించాలన్నారు. పరిశుభ్రమైన గ్రామపంచాయతీ వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉంటారన్నారు. వార్డు సభ్యులు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.