కొండపి: కొండేపి నియోజకవర్గ వ్యాప్తంగా ఈస్టర్ పండుగను పురస్కరించుకొని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు
కొండేపి నియోజకవర్గ వ్యాప్తంగా ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఆదివారం క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పొన్నలూరు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ చుండి ప్రభాకర్ వాక్యోపదేశం చేశారు. సమస్త మానవాళి పాపాల కోసం ఏసు క్రీస్తు సిలువ వేయబడి మూడవ రోజు పునరుద్ధానుడై తిరిగి సమాధిలో నుంచి లేచారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు మార్గంలో నడవాలని ఆయన సూచించారు.