కొండపి: పొన్నలూరు మండలంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించుకుంటే 1050 రూపాయల జరిమానా : ఎస్సై అనూక్
పొన్నలూరులో శనివారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్సులు, హెల్మెట్లు లేని వారిని గుర్తించి జరిమానాలు విధించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వారికి రూ.1050 చొప్పున, డ్రైవింగ్ లైసెన్స్ లేని నలుగురికి రూ.200 చొప్పున జరిమానా విధించినట్లు ఎస్ఐ అనూక్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు