నిజామాబాద్ రూరల్: నర్సింగ్ పల్లి గ్రామంలో తాళం వేసిన రెండు ఇళ్లల్లో దొంగలు చేతివటం
మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలో తాళం వేసిన రెండు ఇళ్లలో దుండగులు చోరీ చేసినట్లు ఎస్ఐ సుస్మిత తెలిపారు. గ్రామానికి చెందిన గన్నారం మోహన్ తో పాటు, అదే గ్రామానికి చెందిన దుబ్బాక గంగమని ఇద్దరు ఇంటికి తాళాలు ఉండడంతో ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న,నగదు బంగారు నగలను దోచుకెళ్లారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.