వికారాబాద్: పార్టీలు ఏవైనా దేశ ప్రజల కోసం, సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి ప్రధాని మోడీ - మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
భారత దేశ ప్రజల సంక్షేమం కోసం పార్టీలు ఏవైనా పాటుపడే వ్యక్తి మాత్రం ప్రధాని మోడీ అని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో విజయ సంకల్ప యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సభలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే దేశాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్న వ్యక్తి ప్రధాని మోడీ అని అన్నారు.