నంద్యాల అర్బన్: నంద్యాలలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు విషయం వివాదాస్పదం
Nandyal Urban, Nandyal | Sep 13, 2026
నంద్యాలలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు వివాదానికి దారితీసింది. శ్రీకృష్ణదేవరాయలను బలిజ కులస్థుడిగా చిత్రీకరిస్తూ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని యాదవ సంఘం నాయకులు వ్యతిరేకిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలు యాదవ కులానికి చెందిన వారు అనేందుకు తమ వద్ద చారిత్రక ఆధారాలు ఉన్నాయని యాదవ సంఘం నేతలు పేర్కొంటున్నారు. విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో యాదవులకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు