శ్రీశైలం: వాట్సప్ మన మిత్ర లో శ్రీశైల దేవస్థానం ముందంజలో ఉంది : ఈవో శ్రీనివాసరావు
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాట్సప్ గవర్నెన్స్ లో శ్రీశైలం దేవస్థానం అన్ని దేవాలయాల కంటే ముందంజలో ఉందని 80 శాతం టికెట్లు వాట్సాప్ గవర్నమెంట్ లో అమ్ముడు అవుతున్నాయని, మిగతా 20 శాతం టికెట్లు దేవస్థానం వెబ్సైట్లో అమ్ముడు అవుతున్నాయని ,EO శ్రీనివాసరావు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వెబ్సైట్లను ఒకే గొడుగు కింద తీసుకురావడం కోసం ఈ వెబ్సైట్ను రూపొందించాలని కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈఓ శ్రీనివాసరావు తెలియజేశారు.