మానకొండూరు: శంకరపట్నం మండలంలోని పిహెచ్సిలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ముందస్తు బతకమ్మ వేడుకలు...
శంకరపట్నం పీహెచ్సీలో ముందస్తు బతుకమ్మ వేడుకలు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది ఆరోగ్య కేంద్ర ఆవరణంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఎప్పుడు విధుల్లో బిజీగా ఉండే మహిళా వైద్య సిబ్బంది సాంప్రదాయ అలంకరణ చేసుకొని బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సాంప్రదాయ పద్ధతిలో చప్పట్లు కొడుతూ ఆడి పాడారు.మహిళలు బతుకమ్మ ఆడే ప్రాంగణంలో మహిళా సిబ్బంది కోసం వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైద్య సిబ్బంది బతుకమ్మ ఆడడాన్ని స్థానికంగా ఉండే ప్రజలు వచ్చి తిలకించారు..